రాధే శ్యామ్ షూట్‌లో పాల్గొన్న సత్యరాజ్..!

Published on Aug 22, 2021 1:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియన్ సినిమా వచ్చే సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఈ సినిమా షూట్ పూర్తయిందని మేకర్స్ వెల్లడించినప్పటికీ తాజాగా సీనియర్ నటుడు సత్య రాజ్ ఈ సినిమా షూట్‌లో జాయిన్ అయ్యాడని సమాచారం.

అయితే ఈ రోజు కడపలో జరిగిన రాధే శ్యామ్ షూట్‌లో సత్య రాజ్ పాల్గొన్నాడు. కాగా అసలు సత్య రాజ్ ఈ షూట్‌లో ఎందుకు పాల్గొన్నాడు? సినిమాలో అతని పాత్రను ఏ విధంగా చూపించారు? అనేవి తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకోబోతుంది.

సంబంధిత సమాచారం :