నాగచైతన్య , నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం సవ్యసాచి . ఈ చిత్రంలో ‘ నిన్ను రోడ్డు మీద చూసినది ‘అనే సాంగ్ ను రీమిక్స్ చేయనున్నారని తెలిసిందే. ఈ సాంగ్ షూటింగ్లో నాగచైతన్యతో పాటు ,తమన్నా పాల్గొననున్నారు . ఈ సాంగ్ చిత్రీకరణ తప్ప మిగితా పార్ట్ ను పూర్తి చేసుకోని ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ ను జరుపుకుంటుంది ఈ చిత్రం. బాహుబలి చిత్రానికి గ్రాఫిక్స్ ను అందించిన మకుట సంస్థ ఈ చిత్రానికి పనిచేస్తుంది.ఇక అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు .
ఇంతకు ముందు జులై 27 న లేదా ఆగష్టు 10 వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు వున్నాయని వార్తలు వచ్చాయి . తాజాగా ఇప్పుడు ఆగష్టు 3న విడుదల అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి .మరి ఈ విషయం ఫై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు . తొందర్లోనే ఈ చిత్ర రిలీజ్ ఫై స్పష్టత ఇవ్వనున్నారు చిత్ర నిర్మాతలు . మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది .
