నాగచైతన్య ‘సవ్యసాచి’ మొదలయ్యేది ఎప్పుడంటే !


అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘యుద్ధం శరణం’ విడుదల కోసం ఎదురుచూస్తూనే తన తర్వాతి ప్రాజెక్ట్ ‘సవ్యసాచి’ ని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. యువ దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ప్రేమమ్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

అంతేగాక టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విభిన్నంగా ఉండటంతో సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇకపోతే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్ 20న అనగా అక్కినేని నాగేశ్వరరావుగారి పుట్టినరోజునాడు మొదలుపెట్టనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నటీనటులెవరు, ఇతర తారాగణం ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.