‘సై రా’ కోసం అల్లు అర్జున్ ?

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లో జరుపుకున్న లాంగ్ షెడ్యూల్ లో కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను మరియు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించింది చిత్రబృందం.

ఈ చిత్రంలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి స్టార్ నటులు నటిస్తుండగా ఇప్పుడు అల్లు అర్జున్ పేరు కూడ వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ నటించడంలేదట, సినిమా కోసం తన వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version