“లక్ష్య” నుంచి బ్యూటిఫుల్ గా సాయా సాయా సాంగ్.!

Published on Dec 4, 2021 4:10 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా దర్శకుడు ధీరేంద్ర సంతోష్ జగర్లపూడి తెరకెక్కించిన ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ ఎమోషన్స్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా ట్రైలర్ తో కూడా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికర సాంగ్ ని మేకర్స్ రిలీజ్. ‘సాయా సాయా’ సాగే ఈ సాంగ్ బ్యూటిఫుల్ గా ఉందని చెప్పాలి.

కృష్ణ కాంత్ రాసిన ఈ సాంగ్ మంచి లిరిక్స్ తో వినడానికి అలాగే లిరికల్ గా కొన్ని విజువల్స్ లో చూడడానికి బావుంది. అలానే నాగశౌర్య మరియు కేతికల మధ్య మంచి కెమిస్ట్రీ కూడా ఇందులో కనిపించింది. అయితే సంగీత దర్శకుడు కాల భైరవ ట్యూన్ ఈ సాంగ్ కి కొన్ని కొత్త బీట్స్ తో ఇంప్రెసివ్ గా ఉన్నాయని చెప్పాలి. మొత్తంగా మాత్రం ఈ సినిమా నుంచి సాంగ్ ప్రామిసింగ్ గా ఉంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :