బాలీవుడ్ లో లక్ పరీక్షించుకోనున్న ‘అఖిల్’ హీరోయిన్

sayesha-saigal
‘అక్కినేని అఖిల్’ డెబ్యూట్ సినిమా ‘అఖిల్’ తో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి ‘సాయేషా సైగల్’ ఆ చిత్రం ప్లాప్ అవడంతో నిరుత్సాహానికి గురైంది. ఆ సినిమా తరువాత ఆమెకు తెలుగులో పెద్దగా ఆఫర్స్ కూడా రాలేదు. దీంతో సాయేషా వెంటనే బాలీవుడ్ పై దృష్టి పెట్టి ఆరంభంలోనే పెద్ద ప్రాజెక్ట్ ను చేజిక్కించుకుంది. అదే స్టార్ హీరో ‘అజయ్ దేవగన్’ నటిస్తున్న ‘శివాయ’ చిత్రం.

ఈ చిత్రంలో సాయేషా అజయ్ దేవగన్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ తన సొంత బ్యానర్ అయిన ‘అజయ్ దేవగన్ ఫిలిమ్స్’ పై నిర్మిస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్స్ ద్వారా సాయేషాకు మంచి ప్రశంసలు కూడా అందాయి. ఈ చిత్రం తనకు బాలీవుడ్ లో తప్పకుండా బ్రేక్ ఇస్తుందని భావిస్తున్న ఆమె త్వరలో తన నెక్స్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేయనున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలాఖరున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.