‘కెమెరామెన్ గంగతో రాంబాబు’తో ఆడిపాడుతున్న స్కార్లెట్ విల్సన్

Published on Jun 30, 2012 10:55 pm IST


ఈ మధ్య ఐటెం సాంగ్స్ ప్రపంచంలో బాగా వినిపిస్తున్న పేరు స్కార్లెట్ విల్సన్. యుకె లో పుట్టిన ఈ కథానాయిక మరియు డాన్సర్ ఇటీవలే దెబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన ” షాంగై ” చిత్రంలో తన మొదటి ఐటెం సాంగ్ తో తెరకు పరిచయమై తన అందచందాలతో ప్రేక్షకుల మతి పోగొట్టారు. ఈ పాటతో ఈ అందాల భామ ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనమివ్వడంతో అవి చూసిన మన తెలుగు నిర్మాతలు తమ సినిమాలో తనతో ఐటెం సాంగ్ చేయించడం కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎవడు’ చిత్రంలో ఐటెం సాంగ్ చెయ్యడానికి ఈ భామ అంగీకరించారు. కానీ ఈ చిత్రం కంటే ముందే విడుదలకానున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ” కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంలో ఈ భామతో ఐటెం సాంగ్ చేయిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు స్కార్లెట్ విల్సన్ పై ఐటెం సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో భారీ ఎత్తున అక్టోబర్ 18న విడుదల కాబోతున్న ఈ చిత్రంతో స్కార్లెట్ విల్సన్ అందరి చూపులను ఆకర్షిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గర్బియేల బెర్తంతే ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :