ఎవరూ ఊహించలేని స్క్రీన్ ప్లేతో ‘ఒక్క క్షణం’ !

10th, December 2017 - 05:23:53 PM

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం ‘ఒక్క క్షణం’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ విని ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ డిసెంబర్ నెల 28న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విభిన్నంగా ఉండి ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ టీజర్ కు తగ్గట్టే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా వైవిధ్యంగా ఉంటుందని విని ఆనంద్ అంటున్నారు.

ప్యారలల్ లైఫ్ తో ముడిపడి ఉండే ఈ చిత్రంలో ఒక జంటది ప్రెజెంట్ మరొక జంటకు ఫ్యూచర్ గా ఉంటుంది. ఈ కొత్త కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే ఎవరూ ఊహించలేనట్టుగా ఉంటుంది అన్నారు. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రంలో శిరీష్ కు జోడీగా సురభి, శీరత్ కపూర్ లు నటించారు.