ఈసారి కూడా అదే ఫార్ములా అంటున్న ప్రభాస్ !

28th, September 2017 - 09:18:29 AM


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నారు. ‘ బాహుబలి’ లాంటి భారీ విజయం తర్వాత వస్తున్నా ప్రభాస్ సినిమా కావడంతో ఎలా ఉండబోతోంది, ‘బాహుబలి’ స్థాయిలో కాకాపోయిన దానికి దగ్గరగా అయినా ఉంటుందో లేదో అని అందరిలోను తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రభాస్ మాత్రం చిత్రం తప్పకుండా అందరినీ సంతృప్తిపరుస్తుందని చాలా ధీమాగా చెబుతున్నారు.

సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోందని, ఇందులో స్క్రీన్ ప్లేనే అసలు హీరో అని అన్నారు. ‘బాహుబలి’ చిత్రంలో కూడా కథ సాధారణమైనదే అయినా దానికి రాజమౌళి జోడించిన స్క్రీన్ ప్లేనే అందరినీ మంత్రం ముగ్దుల్ని చేసిన సంగతి తెలియసిందే. ‘బాహుబలి’ తర్వాత తర్వాత ప్రభాస్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసం బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్, మందిరా బేడీ వంటి ఇతర బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు.