చిరు 151వ సినిమా ప్లాన్స్ షురూ..!

చిరు 151వ సినిమా ప్లాన్స్ షురూ..!

Published on Sep 25, 2016 11:35 AM IST

chiranjeevi
మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నెం. 150’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మెగాస్టార్ తదుపరి సినిమాకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పట్నుంచే మొదలయ్యాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసమే చిరు టీమ్ ఇప్పటికే ఇండస్ట్రీలోని టాప్ కమర్షియల్ డైరెక్టర్స్‌తో సంప్రదింపులు జరుపుతోందట. చిరంజీవికి మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన ఆయన బ్లాక్‌బస్టర్ సినిమాల స్టైల్లో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందట. 150వ సినిమాలానే ఆ తర్వాత వచ్చే సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అల్లు అరవింద్ ఇప్పట్నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇక డిసెంబర్ నెలాఖర్లో కానీ, జనవరిలో కానీ చిరు 151వ సినిమా అనౌన్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు