ఓటీటీలోకి వచ్చేస్తున్న “సెబాస్టియన్ పిసి 524”..!

Published on Mar 12, 2022 11:10 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి 524’. మార్చి 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. తెలుగు ఓటీటీ వేదిక “ఆహా”లో మార్చి 18 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. బాలాజీ సయ్యపురెడ్డి ద‌ర్శ‌కునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :