‘సెబాస్టియన్‌ పిసి524’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Feb 27, 2022 2:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. బాలాజీ సయ్యపురెడ్డి ద‌ర్శ‌కునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ని కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 28న ఉదయం 11:04 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే నేడు ఉదయం 11:04 నిమ్షాలకు ట్రైలర్ గ్లింప్స్‌ని విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే జిబ్రాన్‌ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

సంబంధిత సమాచారం :