ట్రైలర్ తో ఆకట్టుకున్న ‘సెబాస్టియన్‌ పిసి524’ !

Published on Feb 28, 2022 11:04 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. బాలాజీ సయ్యపురెడ్డి ద‌ర్శ‌కునిగా పరిచయమవుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ట్రైలర్ లో ఫన్ తో పాటు హీరో క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేశారు. సినిమాలో ఎమోషన్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా బాగుంది.

మొత్తానికి ట్రైలర్ నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటుంది. హీరోకి ఉన్న లోపానికి, అతని జాబ్ కి మధ్య ఉన్న కాన్ ఫ్లిక్ట్ కూడా హైలైట్ గా ఉంది. ఇక ఈ చిత్రానికి సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం టైటిల్ అనౌన్సమెంట్ నుంచి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పైగా ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన కూడా వచ్చింది. అందుకే.. ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :