“సెబాస్టియన్” నుంచి “హేలి” సాంగ్ రిలీజ్..!

Published on Feb 17, 2022 10:01 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఎలైట్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ పతాకంపై “సెబాస్టియ‌న్ పి.సి. 524” అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాలాజీ సయ్యపురెడ్డి ద‌ర్శ‌కునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ప్ర‌మోద్, రాజులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 25న తెలుగు మరియు తమిళ్‌లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి “హేలి” అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. గిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను శానపతి భరద్వాజ్ పాత్రుడు రచించగా, కపిల్ కపిలన్ ఆలపించారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :