మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ పీరియాడిక్ విజువల్ వండర్ సైరా నరసింహారెడ్డి నైజాంలో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు 7.9 కోట్ల షేర్ తో టాప్ షేర్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచినా సైరా రెండవ రోజు కూడా సత్తా చాటింది. వర్కింగ్ డే అయిన గురువారం కూడా సైరా 3.98 కోట్ల షేర్ రాబట్టి అబ్బురపరిచింది.
ఇక నేటి నుండి వీకెండ్ మొదలు కావడంతో పాటు దసరా సెలవలు కూడా కావడంతో సైరా వసూళ్లు అంచనాలకు మించి ఉండే అవకాశం కలదు. రెండు రోజులలో నైజాంలో 11.7 కోట్ల షేర్ వసూలు చేసిన సైరా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 40కోట్ల షేర్ కొల్లగొట్టింది. గోపీచంద్ చాణక్య మినహా పెద్ద చిత్రాల విడుదల లేకపోవడం, దసరా పండుగ కూడా ఉండటంలో సైరా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం కలదు.
