ఆది సినిమాలో సెకండ్ హీరోయిన్ ఖరారు ?

ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు ఆది. తాజాగా ఈయన కథానాయకుడిగా ‘లవర్స్‌’ సినిమా దర్శకుడు హరితో సినిమా చెయ్యబోతున్నాడు. తాప్సి ఈ సినిమాలో హీరోయిన్. ఎంవివి.సత్యనారాయణ, కోన వెంకట్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ మూవీలో మరో హీరోయిన్ నటించబోతుందని సమాచారం. చాలా మంది హీరోయిన్స్ ను అనుకున్నారు కాని చివరికి రితిక సింగ్ ను ఫైనల్ చేసారని తెలుస్తోంది. రితిక ‘గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి పేరు తెచ్చుకుంది. ఆది పినిశెట్టి ఈ సినిమాలో చూపులేని వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఈ మద్య రవితేజ బ్లైండ్ రోల్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే, అదే తరహాలో ఆది నటించబోతుండడం విశేషం.