ప్లెజెంట్ గా శివ కార్తికేయన్ “ప్రిన్స్” సరికొత్త లుక్..!

Published on Jun 10, 2022 9:00 am IST

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో ఒకడైన శివ కార్తికేయన్ కి మన తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. రీసెంట్ గా తన నుంచి వచ్చిన రెండు సినిమాలు డాక్టర్ మరియు డాన్ లు అటు తమిళ్ తో పాటు మన తెలుగులో కూడా మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు మన తెలుగు యంగ్ డైరెక్టర్ అనుదీప్ కె వి తో ప్లాన్ చేసిన బై లాంగువల్ చిత్రం “ప్రిన్స్” ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యగా దానికి నిన్న మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ సెకండ్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో శివ కార్తికేయన్ తో పాటుగా హీరోయిన్ మరియా లుక్ ని కూడా రివీల్ చేసారు. అయితే ఈ పోస్టర్ లో ఈ ఇద్దరు మంచి కూల్ అండ్ ప్లెజెంట్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి అయితే ఈ కాంబోలో ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ వచ్చేలా అనిపిస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనేది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీనివాస సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :