నాగ శౌర్య “కృష్ణ వ్రింద విహారి” నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on May 3, 2022 3:00 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఏముందిరా ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే విశేష స్పందన లభించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగ శౌర్యకు సరసన హీరోయిన్ గా షిర్లీ సెటియా కనిపించనుంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంను మే 20, 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :