రానా “విరాట పర్వం” నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on Jun 1, 2022 12:40 pm IST


రానా దగ్గుబాటి హీరోగా నటించిన విరాట పర్వం జూన్ 17, 2022న గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కథానాయికగా నటించింది. విరాట పర్వం యొక్క మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం నుండి రెండవ పాట, నగాదారిలో, రేపు ఉదయం 11:07 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సురేష్ బొబ్బిలి ఈ ట్రాక్ ను కంపోజ్ చేయడం జరిగింది. నందితా దాస్, నివేదా పేతురాజ్, ప్రియమణి, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తం గా నిర్మించాయి.

సంబంధిత సమాచారం :