ఏజెంట్ నుండి నేడు సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్!

Published on Mar 22, 2023 11:24 am IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, అఖిల్ అక్కినేని స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్‌తో తన అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. సాక్షి వైద్య ఈ సినిమా లో కథానాయిక గా నటిస్తుంది. తాజా సమాచారం ఏమిటంటే, సెకండ్ సింగిల్ ఏందే ఏందే ప్రోమోను ఈరోజు సాయంత్రం 05:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

పూర్తి సాంగ్ ను మార్చి 24, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రం కి వక్కంతం వంశీ కథను అందించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి హిప్హాప్ తమిజా సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :