తమిళ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువా’ నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తుండగా పూర్తి ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ సినిమా నుండి ఇప్పుడు మరో ఆసక్తికర అప్డేట్ను ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వారు అనౌన్స్ చేశారు. ఈ సినిమాలోని డ్యాన్స్ నెంబర్‌గా ఈ సాంగ్ ఉండబోతుందని.. ఈ సాంగ్‌ని అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సాంగ్ సినిమాలో ప్రెజెంట్ జనరేషన్లో వచ్చే సాంగ్ అని అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో రెండు విభిన్నమైన కాలాలకు సంబంధించిన కథను మనకు చూపెట్టబోతున్నారు.
‘కంగువా’ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా అందాల భామ దిశా పటాని హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. నవంబర్ 14న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.