‘ది GOAT’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్

‘ది GOAT’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్

Published on Jun 22, 2024 6:35 PM IST

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ది GOAT’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ ప్ర‌భు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్ట‌ర్స్, ఫ‌స్ట్ సాంగ్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి.

కాగా, నేడు విజ‌య్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘ది GOAT’ మూవీ నుండి మేక‌ర్స్ సెకండ్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘చిన్న చిన్న కంగ‌ల్’ అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ ను విజ‌య్ తో పాటు యువ‌న్ శంక‌ర్ రాజా, రాజ భ‌వ‌తారిని పాడారు. ఈ పాట‌కు యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు.

ఇక ఈ సినిమాను పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా మేక‌ర్స్ తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో ప్రశాంత్, ప్ర‌భుదేవా, మోహ‌న్, జ‌య‌రాం, స్నేహ, లైలా త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు