“విక్రాంత్ రోణ” సెకండ్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Jun 30, 2022 10:00 pm IST

ఇటీవల విక్రాంత్ రోణ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి మరియు సినిమా యొక్క 3D అనుభవాన్ని చూడటానికి ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు మేకర్స్ నుండి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, రెండో సింగిల్ ని కన్నడలో జూలై 2న విడుదల చేయనున్నారు.

తాజా వార్తల ప్రకారం ఇతర వెర్షన్లు వేర్వేరు రోజుల్లో విడుదలవుతాయి. మొదటి రా రా రక్కమ్మ ఇప్పటికే ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాన్ ఇండియన్ మూవీని కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్, ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రంగి తరంగ ఫేమ్ అనుప్ బండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు అభినయ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 5 భాషల్లో జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :