రెండో పాటను విడుదల చెయ్యనున్న ‘అజ్ఞాతవాసి’ టీమ్ !
Published on Nov 21, 2017 5:33 pm IST

పవన్, త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తోన్న సినిమా పేరు ఇంకా అధికారంగా ప్రకటించనప్పటికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ఖరారయ్యేలా ఉంది. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ మద్య త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘బయటికి వచ్చి చుస్తే’ పాట బాగా పాపులరయ్యింది. దీంతో ఆడియో ఆల్బమ్ పై అమితమైన క్రేజ్ నెలకొంది. ఈ పాట ఒక్కటే కాక మిగిలిన పాటలు కూడా ఇదే రేంజ్ లో ఉండబోతున్నాయని టాక్. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో రెండో పాటను త్వరలో విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్. ‘కోడక కోటేశ్వరరావు’ అంటూ సాగే ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

 
Like us on Facebook