“ఇస్మార్ట్ శంకర్” నుండి రెండో ట్రైలర్ కూడా, ఎప్పుడంటే…!

దర్శకుడు పూరి జగన్నాధ్ హీరో రామ్ ని ఈసారి “ఇస్మార్ట్ శంకర్” మూవీలో ఉరమాస్ తెలంగాణా పోరగాడిగా చూపించబోతున్నాడు. ఈనెల 18న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. నభా నటేష్,నిధి అగర్వాల్ రామ్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ “మణిశర్మ” పోకిరి సినిమా తర్వాత మళ్ళీ పూరి సినిమాకి స్వరాలు అందిస్తున్నారు.

ఐతే ఇప్పటికే ఓ ట్రైలర్ లో ఊరమాస్ నాటు అవతారంలో రామ్ ని చూపించిన చిత్ర యూనిట్ మరో ట్రైలర్ ని విడుదల చేయనున్నారట. ఈ విషయాన్ని నటి ఛార్మి స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించడం జరిగింది. నేడు సాయంత్రం 5గంటలకి “ఇస్మార్ట్ శంకర్” ట్రైలర్ విడుదల చేయనున్నారు. మరి ఈ సెకండ్ ట్రైలర్ లో పూరి జగన్నాథ్ రామ్ పాత్రకు సంబంధించి ఇప్పటికి తెలియని కొత్త విషయాలేమైనా పరిచయం చేస్తారేమో చూడాలి మరి.

We have decided to show you all little more of #iSmartShankar!!

🤩🤩🥳🥳🥰🥰#iSmartShankarTrailer2 at 5 PM Today!!

@ramsayz @purijagan @AgerwalNidhhi @NabhaNatesh @ActorSatyaDev @PuriConnects #ManiSharma #PCfilm#iSmartShankarOnJuly18th pic.twitter.com/gfVsfHpvwq

— Charmme Kaur (@Charmmeofficial) July 12, 2019