‘సాహో’ చిత్రంలో శ్రద్దా పాత్ర యొక్క సీక్రెట్ ఏమిటో బయటపడింది !


ప్రభాస్ – సుజీత్ కలయికలో రూపొందుతున్న ‘సాహు ‘ చిత్రంలో బాలీవబుద్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా శ్రద్దా కపూర్ సినిమాలో డ్యూయెల్ రోల్ చేస్తోందనే వార్తలు బాగా హడావుడి చేశాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె రెండు పాత్రలుక్లో నటించడంలేదని తేలిపోయింది.

ఇక్క ఇంకో చిన్న ట్విస్ట్ ఏమిటంటే ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయట. అంటే ఒక షేడ్ ఫైట్స్, స్టంట్స్ చేసే మాడరన్ అమ్మాయి కాగా ఇంకో షేడ్ సంప్రదాయత ఉట్టిపడే రాయలసీమ అమ్మాయి పాత్రట. మాదారం అమ్మాయి పాత్ర కోసం శ్రద్దా హాలీవుడు స్టంట్ మాస్టర్ కెన్నీ బాట్స్ వద్ద ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. శ్రద్ద కపూర్ తో పాటు పలువురు బాలీవుడ్ నటులు సైతం ఇందులో నటిస్తున్నారు.