సీక్రెట్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్ టీం !

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరొయిన్స్ గా వక్కంతం వంశి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘నాపేరు సూర్య‌’. నా ఇల్లు ఇండియా. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో గుడ్ మేకింగ్ వాల్యూస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈరోజు రాత్రి 10:30 నిమిషాలకు ఈ సినిమా గురించి ఒక సిక్రెట్ వెల్లడించబోతున్నారు చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టిజర్ విడుదల తేదిని ప్రకటించవచ్చని సమాచారం. విశాల్ శేఖ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమాలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.