సెన్సార్ బోర్డుకు షకీల అభ్యర్ధన !

shakila

ఒకప్పుడు మళయాళంలో ‘షకీలా’ చిత్రం వస్తుందంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆమె చిత్రాలకు పోటీగా తమ చిత్రాలను విడుదల చేసేవారు కాదు. అలాంటి ‘షకీలా’ చాలా సంవత్సరాల తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘శీలవతి’. ఇది ఆమె 250వ సినిమా. ఇప్పటికే పలుమార్లు ఆగిన ఈ చిత్రాన్ని త్వరగా విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ సెన్సార్ బోర్డు నుండి ఈ చిత్రం టైటిల్ మార్చాలంటూ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

‘షకీలా’ సెన్సార్ సభ్యుల అభ్యంతరాలకు స్పందింస్తూ.. ‘చిత్రం చూడకుండానే చిత్రం పేరు మార్చమనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికే ‘శీలవతి’ చిత్రం విడుదల బాగా ఆలస్యమైందని ఈ చిత్రానికి దయచేసి అడ్డు రావొద్దని సెన్సార్ సభ్యులను కోరుకున్నారు. పైగా చిత్ర ప్రమోషన్స్ కు చాలా ఖర్చు పెట్టామని ఇప్పుడు టైటిల్ మారిస్తే ఆ ఖర్చు అంతా వృధా అవుతుందని షకీలా తన బాధనంతా ఓ వీడియోలో చిత్రీకరించి ఆ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Exit mobile version