‘సీతారామం’ తమిళ్ హక్కులు సొంతం చేసుకున్న బడా సంస్థ …!!

Published on Jul 26, 2022 8:30 pm IST

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సీతారామం. హను రాఘవపూడి తీస్తున్న ఈ యాక్షన్ ఎమోషనల్ లవ్ స్టోరీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మించగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మిక మందన్న ఒక కీలక రోల్ చేసిన ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

మరోవైపు ఇప్పటికే విడుదలైన సీతారామం ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. యుధ్దముతో రాసిన ప్రేమకథ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సీతారామం మూవీ ఆగష్టు 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ యొక్క తమిళ్ రైట్స్ ని అక్కడి ప్రముఖ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు. కొద్దిసేపటి క్రితం కార్తీ సీతారారామం తమిళ్ ట్రైలర్ లాంచ్ చేసారు. కాగా ఈ మూవీ తమిళ్ రైట్స్ ని అందుకోవడం,అలానే ఆగష్టు 5 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ అకౌంట్స్ లో అఫీషియల్ పోస్ట్ రిలీజ్ చేసింది లైకా ప్రొడక్షన్స్ టీమ్.

సంబంధిత సమాచారం :