ప్రేక్షకులతో కలిసి మూవీ చూసిన ‘సీతారామం’ యూనిట్

Published on Aug 5, 2022 5:09 pm IST

దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ నేడు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక కీలక రోల్ చేసిన ఈ మూవీని హను రాఘవపూడి తెరకెక్కించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు.

కాగా నేడు మార్నింగ్ షోని హైదరాబాద్ లో ప్రేక్షకాభిమానులతో కలిసి చూసిన సీతారామం యూనిట్, మూవీ పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా మూవీ చూసి థియేటర్ నుండి బయటకు వచ్చిన అనంతరం దర్శకుడు హనుని చూసి ఆనంద భాష్పాలతో కౌగిలించుకున్నారు హీరోయిన్ మృణాల్, హీరో దుల్కర్. మొత్తంగా అన్ని ప్రాంతాల నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ని సీతారామం దక్కించుకుంది.

సంబంధిత సమాచారం :