డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి సీటీ మార్…అక్టోబర్ 15 నుండి..

Published on Oct 12, 2021 5:31 pm IST

గోపిచంద్, తమన్నా భాటియా హీరో హీరోయిన్ లుగా సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సీటీమార్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. దిగంగన సూర్యవంశీ మరియు భూమిక చావ్లా లు కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ పతాకం పై ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం గా ఉంది.

స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అయ్యేందుకు సిద్దం అవుతుంది. అక్టోబర్ 15 వ తేది నుండి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

సంబంధిత సమాచారం :