వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన గోపీచంద్ “సీటిమార్” ఎంత టీఆర్పీ రాబట్టిందంటే?

Published on Mar 10, 2022 7:35 pm IST


గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సీటిమార్. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా, ఇటీవల ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర పై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ బయటికి వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టివి లో ప్రసారం కాగా, అందుకు 6.85 టీఆర్పీ రావడం జరిగింది. తమన్నా భాటియా, దిగంగణ సూర్యవంశీ, భూమిక చావ్లా లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం కి మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :