“హాట్‌స్టార్”లోకి రాబోతున్న సీటీమార్.. ఎప్పటినుంచంటే?

“హాట్‌స్టార్”లోకి రాబోతున్న సీటీమార్.. ఎప్పటినుంచంటే?

Published on Oct 9, 2021 2:08 AM IST


టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “సీటీమార్”. కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదలై సూపర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది.

అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్టాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సీటీమార్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకోగా, ఈ నెల 15 నుంచి ఈ సినిమా హాట్‌స్టార్‌లోకి రాబోతుంది. మొత్తానికి దసరా రోజు హాట్‌స్టార్ ప్రేక్షకులను ఓ మంచి సినిమాతో కనువిందు చేయబోతుందన్న మాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు