పక్కా డిఫరెంట్ ఫిల్మ్ ఇది…డేగల బాబ్జీ పై బండ్ల గణేష్ వ్యాఖ్యలు!

Published on Oct 4, 2021 11:48 am IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న తొలి చిత్ర డేగల బాబ్జీ. ఈ చిత్రం టైటిల్ ప్రకటన మరియు ఫస్ట్ లుక్ ను ఇప్పటికే హరీష్ శంకర్ విడుదల చేయడం జరిగింది. ఒత్తా సెరప్పు సైజ్ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యశ్ రిషి ఫిల్మ్స్ బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. వెంకట్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందుకు సంబంధించిన అప్డేట్ ను బండ్ల గణేష్ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. డేగల బాబ్జీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది అని, త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. పక్కా డిఫెరెంట్ ఫిల్మ్ అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. అంతేకాక ఈ చిత్రం నుండి ఒక వర్కింగ్ స్టీల్ ను పోస్ట్ చేశారు బండ్ల గణేష్.

సంబంధిత సమాచారం :