సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “సెహారి”

Published on Feb 4, 2022 4:15 pm IST


హర్ష్ కనుమిల్లి మరియు సిమ్రాన్ చౌదరి నటించిన తాజా చిత్రం సెహరి. ఈ చిత్రం ను ఫిబ్రవరి 11, 2022న థియేటర్లలో విడుదలకు చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఈరోజు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా CBFC ద్వారా U/A సర్టిఫికేట్ పొందింది.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హర్ష కనుమిల్లి రచించిన ఈ సినిమాలో నందు, అభినవ్ గోమతం మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం, అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి.

సంబంధిత సమాచారం :