త్వరలో విడుదల కానున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సెహరి”

Published on Nov 30, 2021 10:30 am IST


హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సెహరి. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ 60 లక్షల వీక్షణలు పొందగా, సెహరి టైటిల్ సాంగ్, ఇది చాలా బాగుందిలే యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది చాలా బాగుందిలే అనే పాట 80 లక్షల వీక్షణలు పొంది శరవేగంగా కోటి వీక్షణలకు దూసుకు పోతుంది.

త్వరలో విడుదల కానున్న నేపథ్యం లో నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ, “సెహ‌రి టీజర్ మరియు పాటల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
ముఖ్యంగా హీరో హర్ష్ కనుమిల్లి నటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించబడిన సెహరి సినిమా కుటుంబ సమేతంగా వెళ్ళి హాయిగా నవ్వుకుని ఆనందించదగ్గ సినిమా అవుతుంది” అని అన్నారు.

దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ, “ఈ చిత్రంలోని కధ మరియు పాత్రలు అన్నీ యువత మరియు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాం” అని అన్నారు.

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి, అభినవ్‌ గోమఠం, ప్రణీత్‌ రెడ్డి, కోటి, బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక, ప్రొడ్యూసర్స్‌ అద్వయ జిష్ణు రెడ్డి, డీఓపీ అరవింద్‌ విశ్వనాథ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ ఆర్ విహారి, ఎడిటర్‌ రవితేజ గిరిజా, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :