ఆకట్టుకుంటున్న “సెహరి” ట్రైలర్..!

Published on Feb 2, 2022 8:30 pm IST

హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి’. కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో తాజాగా నేడు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ట్రైలర్ విషయానికి వస్తే హర్ష తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అక్క సిమ్రాన్‌ని ప్రేమిస్తాడు. అయితే వయసులో ఆమె హర్ష కంటే నాలుగేళ్లు పెద్దది. అదృష్టం ఏమిటంటే సిమ్రాన్ కూడా అతని వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతుంది. ఈ సమయంలో అతడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. ఇక ఈ చిత్రంలో హీరోకి తండ్రిగా సంగీత దర్శకుడు కోటి నటించాడు. అభినవ్ గోమఠం తన కామెడీతో ఆకట్టుకున్నాడు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :