ఆ డైలాగ్ తో ఇన్ స్పైర్ అయి లవ్ స్టోరి చేశాను – శేఖర్ కమ్ముల

ఆ డైలాగ్ తో ఇన్ స్పైర్ అయి లవ్ స్టోరి చేశాను – శేఖర్ కమ్ముల

Published on Sep 19, 2021 11:08 PM IST

అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా వస్తోన్న ఫీల్ గుడ్ సినిమా “లవ్ స్టోరి”. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ….మా లవ్ స్టోరి ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన మా సినిమా గురించి చెప్పిన మాటలు మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయనకు మా టీమ్ తరుపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము.

ఇక అమీర్ ఖాన్ ను అభిమానించే వాళ్లలో నేనూ ఒకర్ని. ఆయన సినిమా ఖయామత్ తే ఖయామత్ తక్ చూసినప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అమీర్ ఖాన్ ఇలా గన్ పట్టుకుని డిఫరెంట్ సినిమా ఎలా చేయగలిగాడు అని ఆశ్చర్యపోయాను. నేను డాలర్ డ్రీమ్స్ సినిమా చేసి, దానికి నేషనల్ అవార్డ్ పొందాను. ఆ తర్వాత దిల్ చాహతా హై రిలీజైంది. అక్కడా యువత డ్రీమ్స్ కనిపిస్తాయి. ఎక్కడో మా సినిమాలకు తెలియని కనెక్షన్ ఉంది అనిపించింది. సర్ఫరోష్ సినిమా దర్శకుడు నాకు తెలిసిన మిత్రుడే. ఆయన మీకు కథ చెప్పి ఒప్పించి సినిమా చేశాడు. నేనూ ఒకరోజు మీకు కథ చెబుతాననే నమ్మకం కలిగింది. త్రీ ఇడియట్స్ చూశాక, నేను రూపొందించిన హ్యాపీడేస్ కు రిలేటివ్ గా అనిపించింది. అప్పుడు మీ సినిమాలకు నా సినిమాలకు ఎక్కడో తెలియని కనెక్షన్ ఏర్పడుతోంది అని భావించాను.

అమీర్ ఖాన్ హోస్ట్ చేసిన సత్యమేవ జయతే కార్యక్రమం చూశాక..మీలా మరే స్టార్ సొసైటీ కోసం ఆలోచించలేరు అనిపించింది. భగవంతుడే మిమ్మల్ని ఇలా పని చేయిస్తున్నాడు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను. సినిమాలకు ఏదో ఒక పర్పస్ ఉండాలని కోరుకుంటాను. సొసైటీకి ఏదో ఒక మంచి చెప్పాలనుకుంటాను. లీడర్ సినిమాలో నేనో డైలాగ్ రాశాను. అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉందని. ఆ డైలాగ్ నుంచి ఇన్ స్పైర్ అయి లవ్ స్టోరి చిత్రాన్ని తెరకెక్కించాను. లవ్ స్టోరి షూటింగ్ టైమ్ లో ఫస్ట్ వేవ్, రిలీజ్ టైమ్ లో సెకండ్ వేవ్ వచ్చాయి. ఈ కష్టంలోనూ మా సినిమా టీమ్ అంతా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. వాళ్లందరికీ నా థాంక్స్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా చిత్రాన్ని థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నారాయణదాస్ నారంగ్ గారికి కృతజ్ఞతలు. లవ్ స్టోరి చిత్రాన్ని థియేటర్ లో చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు