సూపర్ స్టార్ మహేష్ కి శేఖర్ కమ్ముల థాంక్స్!

Published on Sep 27, 2021 2:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లవ్ స్టోరీ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు కి థాంక్స్ తెలిపారు మీకు ఈ చిత్రం నచ్చినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందని పేర్కొన్నారు. మీరు ఇలా చెప్పడం చాలా హ్యాపీ గా ఉందంటూ చెప్పుకొచ్చారు.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ లవ్ స్టోరీ చిత్రం సర్వత్రా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న చిత్రం గా నిలిచింది. పవన్ సి హెచ్ సంగీతం అందించిన ఈ చిత్రం పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :