ఫస్ట్ లుక్ పోస్టర్ తో ‘ధర్మపురి’ !

Published on Oct 11, 2021 8:00 am IST

కొత్త దర్శకుడు విశ్వ జగత్ దర్శకత్వంలో, భాస్కర్ యాదవ్ దాసరి నిర్మాణంలో శేఖర్ మాస్టర్ ప్రెజెంట్స్ లో రాబోతున్న సినిమా ‘ధర్మపురి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది టీమ్. పోస్టర్ లో ప్రధాన నటినటులని రివీల్ చేస్తూ.. కథ తాలూకు నేపథ్యాన్ని కూడా ఎలివేట్ చేస్తూ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ ను చూస్తుంటే.. సినిమా యాక్షన్ లవ్ స్టోరీలా ఉంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే బీడీ వర్కర్స్ కు సంబంధించిన లైఫ్ స్టైల్ ఆధారంగా ఈ చిత్రం పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. కొత్త నటీనటులతో రాబోతున్న ఈ సినిమాలో హ్యూమన్ రిలేషన్స్ ను హైలైట్ చేస్తూ హద్దులు లేని ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. అలాగే ప్రేమలోని ఓ కొత్త కోణాన్ని కూడా ఈ చిత్రంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం :