శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా “కర్ణ” చిత్రంలోని గుడి యనక నా సామి పాట విడుదల

శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా “కర్ణ” చిత్రంలోని గుడి యనక నా సామి పాట విడుదల

Published on Feb 1, 2022 12:07 PM IST


యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం కర్ణ. సనాతన క్రియేషన్స్ పతాకం పై కళాధర్ కొక్కొండ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో హీరో గా నటిస్తుండడం విశేషం. మోనా ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంత్ BJ సమకూరుస్తుండగా శ్రవణ్ G కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గీతామాధురి ఈ పాటను ఆలపించగా అనిల్ సాహిత్యాన్ని అందించారు.కిరణ్ బందర్ కొరియోగ్రఫీ అందించారు. త్వరలోనే ఈ సినిమా ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుని సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచింది. తాజాగా ఈ సినిమా నుంచి గుడి యనక నా సామీ పాటను విడుదల అయ్యింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటను విడుదల చేయడం విశేషం.

ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, “కర్ణ సినిమాలోని గుడి యనక నా సామీ పాటను విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కిరణ్ బండార్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. తప్పకుండా ఈ పాట మీ అందరిని ఆకట్టుకుంటుంది. అందరికీ అల్ ది బెస్ట్” అని అన్నారు.

కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత కళాధర్ కొక్కొండ, బ్యానర్ సనాతన క్రియేషన్స్, మ్యూజిక్ ప్రశాంత్ BJ, పీఆర్ఓ సాయి సతీష్, పర్వతనేని రాంబాబు లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు