ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన శేఖర్ మాస్టర్.!

Published on May 4, 2022 12:09 am IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి డాన్సింగ్ డైనమైట్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరని అందరికీ తెలిసిందే. ఒక్క డాన్స్ లోనే అని కాకుండా దాదాపు సినిమాకి సంబంధించి అన్ని కళల్లో తారక్ ప్రావీణ్యం ఉన్నవాడు అందుకే తారక్ అభిమానులు కూడా తన నటన గాని టాలెంట్ కోసం గాని చాలా చాలా గర్వంగా చెప్పుకుంటారు. అయితే తారక్ పై తాజాగా ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ వీజే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని రివీల్ చేసారు.

తనకి వచ్చిన ఓ ప్రశ్నలో మన టాలీవుడ్ హీరోల్లో డాన్స్ పరంగా ఎవరు తక్కువ రిహార్సల్స్ చేస్తారనే ప్రశ్నకి సమాధానంగా ఎన్టీఆర్ పేరుని తాను చెప్పారు. తారక్ అయితే అసలు రిహార్సల్స్ కూడా చెయ్యకుండా డైరెక్ట్ డాన్స్ సెట్స్ లోకి వచ్చి అక్కడిక్కడే చేస్తారని చెప్పారు. దీనితో తారక్ ఎంతటి టాలెంటెడ్ నటుడో అందరికీ మరోసారి ఆసక్తికర క్లారిటీ వచ్చింది. ఇది వరకు అయితే వీరి కాంబోలో చాలానే పాటలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :