రాజ “శేఖర్” ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్!

Published on May 3, 2022 6:54 pm IST


ప్రముఖ నటుడు రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రం మే 20, 2022న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆయన భార్య జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018 లో విడుదలైన మలయాళ బ్లాక్‌బస్టర్ జోసెఫ్‌ కి అధికారిక రీమేక్. ఇప్పుడు, తాజా వార్త ఏమిటంటే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మే 5, 2022 న ఆన్‌లైన్‌ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే, ట్రైలర్‌ని ఎవరు విడుదల చేస్తారు మరియు ఆన్‌లైన్‌లో ఏ సమయంలో విడుదల చేస్తారు అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

ఈ చిత్రంలో శివాని రాజశేఖర్, ముస్కాన్, ఆత్మీయ రాజన్, అభినవ్ గోమతం, సమీర్, భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బీరం సుధాకర రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, శివాని రాజశేఖర్ మరియు బొగ్గరం వెంకట శ్రీనివాస్ ఈ థ్రిల్లర్‌ను నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :