ఇంట్రెస్టింగ్ గా “శేఖర్” ట్రైలర్.!

Published on May 5, 2022 2:00 pm IST

టాలీవుడ్ సీనియర్ హీరో అయినటువంటి యాంగ్రి మెన్ రాజశేఖర్ హీరోగా ఇప్పుడు పలు ఆసక్తికర సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తన గరుడ వేగా సినిమా నుంచి రాజశేఖర్ మరిన్ని ఆసక్తికర సబ్జెక్టు లు ఎంచుకుంటూ వస్తున్నారు. అలా తన లైనప్ లో సెటప్ చేసిన తాజా థ్రిల్లర్ చిత్రమే శేఖర్.

జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకి మంచి ప్రమోషన్స్ బయట జరుగుతుండగా ఇప్పుడు మేకర్స్ దీని నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేసారు. అయితే ఇది చూసాక మళ్ళీ రాజశేఖర్ నుంచి ఇంకో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ రాబోతున్నట్టు అర్ధం అవుతుంది. తాను చేసిన పోలీస్ రోల్ ని ఇంట్రెస్టింగ్ రివీల్ చేస్తూ స్టార్ట్ అయ్యిన ఈ ట్రైలర్ తన భార్య మర్డర్ తిరిగే కథగా కనిపిస్తుంది.

అయితే ఇందులో రెండు షేడ్స్ లో రాజశేఖర్ ఆకట్టుకున్నారు. అలాగే ఈ చిత్రంలో రాజశేఖర్ కూతురు శివాని కూడా మంచి పాత్రలో నటించింది. అలాగే ఇందులో అనూప్ ఇచ్చిన నేపథ్య సంగీతం బాగుంది. ఓవరాల్ గా అయితే ఈ ట్రైలర్ ఆసక్తి గానే ఉంది మరి ఈ మే 20న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :