ఆకట్టుకుంటున్న సేనాపతి ట్రైలర్…డిసెంబర్ 31 కి ఆహా వీడియో లోకి!

Published on Dec 29, 2021 11:34 am IST

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, హర్ష వర్ధన్, జ్ఞానేశ్వరీ కండ్రేగుల, సత్య ప్రకాష్, రాకెందు మౌళి, రవి జోష్, జీవన్ కుమార్, రాకీ, పావని రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సేనాపతి. ఈ చిత్రం ను ఆహా వీడియో ద్వారా డిసెంబర్ 31 వ తేదీన డైరెక్ట్ డిజిటల్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను ఆహా వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ లు సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రానికి శ్రావణ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సేనాపతి లో రాజేంద్ర ప్రసాద్ డిఫెరెంట్ రోల్ లో ఇంటెన్స్ గా కనిపిస్తూ ఉండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :