తమిళ చిత్రసీమకు చెందిన ప్రముఖ కమెడియన్ RS శివాజీ ఇకలేరు. ఆయన నేడు మృతి చెందారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న శివాజీ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. శివాజీ తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి, వెయ్యి అబద్ధాలు సినిమాల్లో నటించారు. కాగా శివాజీ చివరగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీలో కనిపించారు. శివాజీ మృతి పట్ల కోలీవుడ్ పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
RS శివాజీ గొప్ప విలక్షణ నటుడే కాదు, మంచి మనిషి కూడా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అని తమిళ సినీ అభిమానులు వేడుకుంటున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున RS శివాజీ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.