సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత!

Published on May 22, 2023 3:09 pm IST

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు నెల రోజులకు పైగా ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం నుండి ఆరోగ్యం మరింత క్షీణించింది. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడం తో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. 73 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందడం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

1973 లో రామారాజ్యం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు శరత్ బాబు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1951 జూలై 31 న శరత్ బాబు జన్మదినం. శరత్ బాబు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా అనేక పాత్రను పోషించిన శరత్ బాబు, దాదాపు 300 పైగా సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :