ఆకాష్ పూరి ‘‘చోర్ బజార్’’లో 25 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటి.!

ఆకాష్ పూరి ‘‘చోర్ బజార్’’లో 25 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటి.!

Published on Mar 1, 2022 1:59 PM IST

మన టాలీవుడ్ మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా సెటిల్ అయ్యి పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు వాటిలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.

ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా నుంచి ఒక్కొక్కటిగా హైలైట్స్ రివీల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అనౌన్స్ చేశారు.

ఇంగ్లీష్, బెంగాళీ సహా అన్ని ప్రధాన భారతీయ భాషా చిత్రాల్లో దశాబ్దాల కెరీర్ సాగించింది అర్చన. వీడు చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కించుకుంది. తెలుగులో ఆమె నటించిన నిరీక్షణ, భారత్ బంద్, లేడీస్ టైలర్ లాంటి చిత్రాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. చోర్ బజార్ చిత్రంతో 25 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపైకి వస్తోంది అర్చన. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.

మరి ఈ “చోర్ బజార్” సినిమా అతి త్వరలోనే థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుండగా సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ,ప్రభు దేవా, ఆర్ట్ – గాంధీ నడికుడికర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్, బాలసుబ్రహ్మణ్యం, సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి. ఆడియో – లహరి, కాస్ట్యూమ్స్ డిజైనర్ – ప్రసన్న దంతులూరి, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను, పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను , స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో – జీఎస్కే మీడియా, మేకప్ – శివ, కాస్ట్యూమ్ చీఫ్ – లోకేష్, డిజిటల్ మీడియా – వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ – ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం – బి. జీవన్ రెడ్డి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు