ప్రముఖ నటి మీనా భర్త హఠాన్మరణం….!!

Published on Jun 28, 2022 11:54 pm IST

తెలుగు సినిమా పరిశ్రమలో బాలనటిగా పలు సినిమాల్లో నటించిన అనంతరం నవయుగం మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన నటి మీనా, ఆపైన సీతారామయ్యగారి మనవరాలు, ఇంద్రభవనం, జగన్నాటకం, చంటి ఇలా వరుసగా అనేక సక్సెస్ఫుల్ సినిమాలు చేసారు. ఆ తరువాత అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ సహా అందరితో నటించారు. అటు తమిళ్, మలయాళం లో కూడా పలు సక్సెసఫుల్ సినిమాల్లో నటించిన మీనా 2009లో విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. ఇక వారి దంపతుల ముద్దుల కూతురు నైనిక ఇటీవల విజయ్ హీరోగా రూపొందిన తేరి మూవీలో నటించింది.

అయితే విషయం ఏమిటంటే ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం కోవిడ్ బారిన పడింది. కాగా ఆ సమయంలో మెల్లగా కోలుకున్న ఆమె భర్త విద్యాసాగర్, అప్పటి నుండి మధ్యలో కొంత అస్వస్థతకు గురవుతున్నారట. ఇక నేడు కొద్దిసేపటి క్రితం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన మరణించడం జరిగింది. కొన్నేళ్ల నుండి విద్యాసాగర్ ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధితో బాధపడుతున్నారని, అలానే ఆయనకి ఇటీవల ఊపిరి తీసుకోవడం కూడా ఒకింత కష్టం అవడంతో వెంటనే ఆయనను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఆయన మనకి దక్కలేదని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఇక మీనా భర్త హఠాన్మరణం విషయం తెలిసిన పలువురు చిత్ర రంగ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :