రెండు వరుస విజయాలతో జోష్ మీద ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తరువాతి సినిమా కోసం దర్శకుడు భోయపాటి శ్రీనుతో జత కట్టిన విషయం తెలిసిందే! ఒక బలమైన కథాంశం చుట్టూ తనదైన భావోద్వేగాన్ని అల్లుకొని సినిమాలు తీసే దర్శకుడు భోయపాటి సినిమాల్లో హీరోతో పాటు కథలో బలమైన పాత్రలు చాలానే ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమాలో కూడా ఆ తరహా పాత్రలు బాగానే ఉన్నాయని టాక్.
ఇక ఈ సినిమాలో ఓ పాత్రకు ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర ఆయనకూ నచ్చడంతో వెంటనే ఓకే కూడా చెప్పేశారట. ఇక త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ఓ అనౌన్స్మెంట్ రానుందని యూనిట్ వర్గాల సమాచారం. ఇక గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించిన శ్రీకాంత్, ఈ సినిమా ద్వారా మరోసారి తనదైన మార్క్‌ను సృష్టించేందుకు సిద్ధమవ్వడం విశేషమే!
అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా కనిపించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. భోయపాటి సినిమాల తరహాలోనే యాక్షన్ అంశాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలనూ నింపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ఇదే సినిమాలో మరో హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనున్నారు.